Header Banner

ఆయన రియల్ లైఫ్ లోనూ హీరోనే.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!

  Sat May 31, 2025 14:52        Politics

నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా సినీ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా కృష్ణ‌కు ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా నివాళి తెలుపుతూ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ సినిమాల్లోనే కాదు... రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోనే అన్నారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయ‌న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేసి విజ‌యవంత‌మ‌య్యార‌ని కొనియాడారు. ఈ మేర‌కు జ‌గ‌న్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

 

ఇది కూడా చదవండి: జగన్ జైలుకుపోవడం మాత్రం పక్కా.. రెండు రోజుల క్రితం అనంతపురంలో..

 

"సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాత‌గా, ద‌ర్శకుడిగా, ఎడిట‌ర్‌గా, స్టూడియో అధినేత‌గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. అల్లూరి పేరు చెబితే... మనకు కృష్ణాగారే మదిలో మెదులుతారు. రాజ‌కీయాల్లోనూ రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో అండగా నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నగారికి అత్యంత ఆప్తులు అయిన కృష్ణ గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు" అని జ‌గ‌న్ త‌న పోస్టులో రాసుకొచ్చారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పీఎస్సార్‌కు మరోసారి అస్వస్థత.. ఈరోజు సాయంత్రం వరకు!

 

ఈరోజు ఉద‌యం సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు! ఎందుకు అంటే.?

 

క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..

 

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YSJagan #KrishnaSuperstar #Krishna #YSJaganMohanReddy #TeluguCinema #Tollywood #AlluriSitaramaRaju #TeluguFilmIndustry #Actor #DirectorProducer